: కొత్త సంవత్సరం వేడుకలకు సిద్ధమవుతున్న రకుల్, తాప్సీ!


నటీనటులు ఏడాదంతా షూటింగులతో బిజీబిజీగా ఉంటారు. కానీ, జనవరి 1 వేడుకలకు మాత్రం దాదాపుగా మిస్ అవరు. అలాగే ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఈ సారి కొత్త సంవత్సరం గోవాలో జరుపుకోనుంది. ‘‘నూతన సంవత్సరం సందర్భంగా గోవా వెళ్లడమే నాకిష్టం. కానీ, గత రెండేళ్లుగా షూటింగులతో బిజీగా ఉండడం వల్ల సాధ్యపడలేదు. కానీ, ఈ సారి మాత్రం గోవాకు వెళుతున్నాను. ఈ సంవత్సరం నా ఫ్రెండ్స్ తో కలసి మరీ వెళుతున్నాను’’ అని రకుల్ తెలిపింది.

తాప్సీ అయితే ఇప్పటికే ఫ్రెండ్స్ తో కలసి సింగపూర్ చెక్కేసింది. ‘‘సింగపూర్ ను చూడాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను. కానీ వీలు పడలేదు. ఈ సారి ఓ వారం పర్యటన కోసం సింగపూర్ వెళుతున్నాను. జనవరి 3న తిరిగి వస్తాను’’ అని తాప్సీ పేర్కొంది. నిఖిల్ సిద్ధార్థ సైతం పుణె లేదా గోవాలో కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోనున్నట్టు ప్రకటించాడు. 

  • Loading...

More Telugu News