: జయకు నోబెల్ శాంతి బహుమతి దక్కేలా ప్రయత్నించాలి... అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో ఆమోదించిన తీర్మానాలు ఇవే!
జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం తొలిసారి జరిగింది. ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 14 తీర్మానాలను ఆమోదించారు. ఆమోదించిన తీర్మానాల్లో ముఖ్యమైనవి ఇవే...
- ఇప్పటి దాకా ఉన్న నిబంధనలను మార్చి, ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికల నిర్వహణ
- పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం
- జయలలితకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలి
- పార్లమెంటులో జయలలిత కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి
- జయలలితకు నోబెల్ శాంతి పురస్కారం దక్కేలా ప్రయత్నించాలి
- జయలలిత పుట్టిన రోజును 'జాతీయ రైతు దినోత్సవం'గా ప్రకటించాలి.