: మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 31న జాతినుద్దేశించి ప్రసంగించే అవకాశాలున్నట్టు సమాచారం. నవంబర్ 8న రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నోట్లను తమ ఖాతాల్లో జమ చేసుకునేందుకు ప్రజలకు ఇచ్చిన గడువు ఈ నెల 30తో ముగిసిపోతుంది. ఈ నేపథ్యంలో ఆ మరుసటి రోజు ప్రధాని మరోసారి ప్రజలకు తన సందేశం వినిపించనున్నట్టు అధికార వర్గాలను బట్టి తెలుస్తోంది.
ఈ ప్రసంగం సందర్భంగా ప్రధాని ఏం ప్రకటిస్తారు...? ఇన్నాళ్లూ తగినంత నగదు లభించక ఎంతో ఇబ్బంది పడిన ప్రజలకు వరాలు ఏవైనా కురిపిస్తారా...? అన్న ఆసక్తి నెలకొంది. ప్రభుత్వ చర్యను సామాన్యులు సైతం తప్పుబట్టిన నేపథ్యంలో ప్రధాని ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది.