: డెడ్లీ వార్నింగ్ అంటే ఇలా ఉండాలి!... అవినీతి అధికారులకు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి తీవ్ర హెచ్చరిక


ప్రభుత్వ అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడితే సహించమంటూ, కఠిన చర్యలు తీసుకుంటామంటూ మన నేతలు వార్నింగ్ లు ఇస్తూ ఉండటం చూస్తూనే ఉంటాం. కానీ, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటర్తే రూటే సెపరేటు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటానని ఆయన చెప్పలేదు. హెలికాప్టర్ నుంచి తోసేస్తానని డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. హెలికాప్టర్ లో మనీలాకు అవినీతి అధికారిని తీసుకెళ్తూ... మార్గమధ్యంలో కిందకు తోసిపారేస్తా అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయకపోతే... ప్రాణాలు కోల్పోతారంటూ వార్నింగ్ ఇచ్చారు. గతంలో ఓ కిడ్నాపర్ ను తాను ఇలాగే హెలికాప్టర్ నుంచి కిందకు పడేశానని... ఇప్పుడు కూడా అదే చేస్తానని చెప్పారు. క్యామరిన్స్ సర్ ప్రావిన్స్ లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ... అవినీతి అధికారులకు ఆయన ఈ హెచ్చరికలు జారీ చేశారు.

మరోవైపు, దేశంలో డ్రగ్స్ అంతం చూస్తాననే హామీతో అధికారంలోకి వచ్చిన రోడ్రిగో... తాను చెప్పినట్టే డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపారు. డ్రగ్స్ సరఫరాదారులు, డ్రగ్స్ బాధితులు కనిపిస్తే కాల్చిపారేసే ఆదేశాలు జారీ చేసి... వేలాది మందిని చంపించేశారు.

  • Loading...

More Telugu News