: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఏకగ్రీవ ఎన్నిక... అమ్మ స్థానాన్ని ఆక్రమించిన చిన్నమ్మ
దివంగత జయలలిత నెచ్చెలి శశికళ తన కలను సాకారం చేసుకునే దిశగా సగం విజయం సాధించారు. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆమె ఎన్నికయ్యారు. కాస్సేపటి క్రితం చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో శశికళను తమ అధినేత్రిగా నేతలంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చిన్నమ్మ ఆధ్వర్యంలో పని చేయాలంటూ ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. పార్టీ జనరల్ సెక్రటరీగా శశికళ ఎన్నిక కావడంతో... పార్టీ పరంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా ఆమె ఆమోదం తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. శశికళ ఎన్నికపై అన్నాడీఎంకే వెబ్ సైట్ లో అధికారికంగా ప్రకటన వెలువడింది. అన్నాడీఎంకే పగ్గాలను శశికళ చేపట్టడంతో... ఆ పార్టీలో కొత్త శకం ప్రారంభమయినట్టయింది.