: హాలీవుడ్ లో విషాదం.. కుమార్తె మరణించిన మర్నాడే దిగ్గజ నటి డెబ్బీ రేనాల్డ్స్ కన్నుమూత
హాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. దిగ్గజ హాలీవుడ్ నటి డెబ్బీ రేనాల్డ్స్ (84) బుధవారం ఆస్పత్రిలో కన్నుమూశారు. కుమార్తె, నటి కేరీ ఫిషర్ మృతి చెందిన తర్వాతి రోజే ఆమె మృతి చెందడంతో హాలీవుడ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. గుండెపోటుతో లాస్ఏంజెలెస్‌లో ఆస్పత్రిలో చేరిన కొద్దిసేపటికే రేనాల్డ్స్ పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. ఆమె కుమార్తె నటి కేరీ ఫిషర్ కూడా మంగళవారం గుండెపోటుతోనే మరణించారు. 'సింగింగ్ ఇన్ ద రైన్' సహా పలు చిత్రాల్లో నటించిన రేనాల్డ్స్ మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు. హాలీవుడ్ హేమాహేమీలనదగ్గ హీరోల సరసన నటించిన ఆమె 1964లో ఉత్తమ నటిగా అకాడమీ అవార్డు అందుకున్నారు.