: 'ద్రవిడ్ ను నా పెన్ను తిరిగి ఇవ్వమని అడిగా'నంటూ పగలబడి నవ్విన అనుష్క శర్మ
‘మిస్టర్ డిపెండబుల్’ ద్రవిడ్ ను తాను తొలిసారి కలిసిన విషయాన్నిబాలీవుడ్ నటి అనుష్క శర్మ గుర్తు చేసుకుంది. ఒక టాక్ షో లో ఈ విషయమై మాట్లాడుతూ, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ద్రవిడ్ ఉన్నాడని తెలుసుకున్న ఆమె, తన తమ్ముడితో కలిసి అక్కడికి వెళ్లిందట. తన తమ్ముడి వద్ద ఉన్న పుస్తకాన్ని, పెన్నుని ద్రవిడ్ కి ఇచ్చి ఆటోగ్రాఫ్ ఇవ్వమని కోరిందట. ఆటో గ్రాఫ్ చేసిన ద్రవిడ్, తన వద్దకు వచ్చిన మరికొంత మంది అభిమానులకు కూడా అదే పెన్నుతో సంతకం చేస్తూ, ఆ పెన్నును తిరిగి అనుష్కకు ఇవ్వడం మర్చిపోయాడట. కొంత సమయం వేచి చూసిన అనుష్క, తన పెన్ను తిరిగి ఇవ్వాలని ద్రవిడ్ ని అడిగానని చెబుతూ ఆ షోలో అనుష్క పగలబడి నవ్వింది.