: పెద్ద నోట్ల రద్దుతో కోటీశ్వరుడైన కోటక్ మహీంద్ర బ్యాంకు మేనేజర్


కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ఢిల్లీలోని కేజీ మార్గ్ కోటక్ మహీంద్రా బ్యాంకు శాఖ మేనేజర్ ఆశిష్ కుమార్ అద్భుతమైన అవకాశంగా మలచుకున్నారు. దీంతో కోట్లకు పడగలెత్తారు. వివరాల్లోకి వెళ్తే... ఢిల్లీ కేజీ మార్గ్‌లోని కోటక్‌ మహింద్రా బ్యాంకు శాఖ మేనేజర్‌ గా ఆశిష్‌ కుమార్‌ పని చేస్తున్నారు. నల్లధనం కేసులో ఇటీవల అరెస్టయిన రోహిత్‌ టాండన్‌ నుంచి ఆయనకు భారీగా ముట్టినట్టు ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులకు తెలిపాడు. నకిలీ ఖాతాల పేరు మీద సుమారు 38 కోట్ల రూపాయలు తన శాఖ ద్వారా ఆయన మార్చినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఈ విధంగా ఆశిష్ కుమార్ ఆయా నల్లకుబేరుల నుంచి 13 కోట్ల రూపాయలు ముడుపులుగా స్వీకరించినట్టు ఐటీ అధికారులు గుర్తించారు.

 ఈ మొత్తం ఖాతాలకు నకలీ ధ్రువపత్రాలను ఆయనే తయారు చేసినట్టు కూడా గుర్తించారు. దీంతో ఐటీ అధికారులు ఢిల్లీ కేజీ మార్గ్‌ లోని కోటక్‌ మహీంద్రా బ్యాంకు బ్రాంచిపై దాడులు నిర్వహించి, తనిఖీలు చేసి మేనేజర్‌ ఆశిష్‌ కుమార్‌ ను అదుపులోకి తీసుకుని సాకేత్ కోర్టులో హాజరుపరిచారు. అతనిని విచారించేందుకు ఈడీ అధికారులకు ఐదు రోజుల కస్టడీకి అప్పగించేందుకు కోర్టు అనుమతినిచ్చింది. దీంతో వారు అతనిని రిమాండ్ కు తీసుకున్నారు. 

  • Loading...

More Telugu News