: నా మనవడు, మనవరాలితో కాసేపు గడిపాను: అమితాబ్ బచ్చన్
సినిమా షూటింగ్ లు, ప్రివ్యూలు, అతిథులు.. ఇలా నిత్యం బిజీగా గడిపే బిగ్ బి.. అమితాబ్ బచ్చన్, ఈరోజు మాత్రం ఢిల్లీలో తన అల్లుడు నడుపుతున్న ఫ్యాక్టరీకి వెళ్లారు. ఈ విషయాన్ని అమితాబ్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. తన అల్లుడు నిఖిల్ నందా ఎండీగా వ్యవహరిస్తున్న ఓ ఫ్యాక్టరీలో పనుండి అక్కడికి వెళ్లానని, తనకు ఎంతో ప్రియమైన తన మనవడు అగస్త్య, మనవరాలు నవ్యతో కాసేపు గడిపానని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. కాగా, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కార్-3’ చిత్రంలో అమితాబ్ నటిస్తున్నారు.