: తొలి వన్డే టికెట్లన్నీ అమ్ముడైపోయాయి: ఎంసీఏ


జనవరి 15న పుణే వేదికగా జరగనున్న తొలి వన్డేకు భారీ స్పందన ఉందని ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) తెలిపింది. ఆ రోజు జరగనున్న భారత్, ఇంగ్లండ్‌ తొలి వన్డేకు టికెట్లు అప్పుడే అమ్ముడు పోయాయిని ఎంసీఏ తెలిపింది. టికెట్ల అమ్మకాలు ప్రారంభించిన 12 రోజుల్లోనే టికెట్లన్నీ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయని ఎంసీఏ వెల్లడించింది. ఆఫ్‌ లైన్‌, ఆన్‌ లైన్‌ ద్వారా విక్రయించే టికెట్లన్నింటినీ అభిమానులు కొనుగోలు చేసేశారని ఎంసీఏ ప్రకటించింది. కాగా, వన్డే, టీట్వంటీ సిరీస్ లో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్లు మూడు వన్డేలు, మూడు టీ-ట్వంటీల్లో పోటీ పడనున్నాయి. అనంతరం ఫిబ్రవరిలో ఆసీస్ తో సిరీస్ ప్రారంభంకానుంది. కాగా, టెస్టు సిరీస్ ను భారత్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News