: కాకానిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సోమిరెడ్డి


నెల్లూరు జిల్లా రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. వైఎస్సార్సీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో గత రెండు రోజులుగా నెల్లూరు రాజకీయాలు దద్దరిల్లాయి. ఈ నేపథ్యంలో సోమిరెడ్డి అవినీతితో దేశ, విదేశాల్లో వందల కోట్ల రూపాయలు సంపాదించారంటూ పలు డాక్యుమెంట్లు విడుదల చేశారు. దీంతో కాకాని తప్పుడు పత్రాలు సృష్టించారని ఆరోపిస్తూ, నెల్లూరులోని పోలీస్ స్టేషన్ లో సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. అలాగే, కాకాని విడుదల చేసిన పత్రాలకు సంబంధించిన సమాచారం పోలీసులకు ఇచ్చారు.

ఈ సందర్భంగా సోమిరెడ్డి  మాట్లాడుతూ, కాకాని అసత్య ఆరోపణలు చేశారని అన్నారు. తనపై ఆరోపణలు నిరూపించాల్సిన అవసరం ఉందని అన్నారు. కాకాని తనపై ఆరోపణలు చేసిన రోజే సీబీఐకి కాదు, దాని అమ్మకు ఫిర్యాదు చేసుకోవాలని సూచించానని చెప్పారు.  

  • Loading...

More Telugu News