: కొన్ని సాంకేతిక కారణాలతో రైల్వేజోన్ ఏర్పాటు చేయడం లేదు: ఎంపీ రాయపాటి
విశాఖపట్టణానికి రైల్వేజోన్ తీసుకువస్తామని ఇచ్చిన హామీకి సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారని, అయితే, కొన్ని సాంకేతిక కారణాల వల్ల జోన్ ఏర్పాటు చేయడం లేదని టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. గుంటూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైల్వే జోన్ కి విశాఖ ఇబ్బంది అవుతున్నప్పుడు, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసేలా ఆలోచించాలని, జోనల్ కార్యాలయం ఏర్పాటుకు గుంటూరు అనుకూలంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నెల 30న నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్ కు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పెద్దనోట్ల రద్దు అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. పెద్దనోట్ల రద్దు దురదృష్టకరమని, నోట్ల రద్దుతో చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని రాయపాటి విమర్శించారు.