: నేను కూడా కొన్ని ఎకరాలు కోల్పోయాను.. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు: కేసీఆర్
ఏ ప్రభుత్వమైనా ప్రాజెక్టులు కట్టే ముందు ప్రజల్లో కొందరు భూములు కోల్పోవడం సహజమేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బహుళ ప్రయోజనాల దృష్ట్యా ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలని కోరారు. ప్రాజెక్టులను నిర్మించడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని... అందుకే మల్లన్న సాగర్ పై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. భూములను కోల్పోతే కలిగే బాధ ఎలా ఉంటుందో తనకు కూడా తెలుసని... అప్పర్ మానేరులో తాను కూడా కొన్ని ఎకరాలు కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకూ ఇవ్వనంత ఎక్కువ పరిహారాన్ని తాము ఇస్తున్నామని తెలిపారు. రిజిస్ట్రేషన్ ధర కంటే 10 రేట్లు అధికంగా చెల్లిస్తున్నామని చెప్పారు. ఈ రోజు శాసనసభలో మాట్లాడుతూ కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.