: కొత్త చట్టం ఎందుకు? 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయండి.. చాలు!: సీపీఎం
మిడ్ మానేరు నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టంపై న్యాయం చేయాలని ఖమ్మం జిల్లా భద్రాచలం ఎమ్మెల్యే, సీపీఎం నేత సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. భూసేకరణ చట్టంపై తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మిడ్ మానేరు నిర్వాసితుల కోసం కొత్తగా చట్టాన్ని చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. 2013 భూసేకరణ చట్టంలో ప్రభుత్వాలు ఏం చేయాలో స్పష్టంగా చెప్పారని, వాటిని యధాతథంగా అమలు చేస్తే సరిపోతుందని ఆయన సూచించారు. కొత్త చట్టాలు చేయాల్సిన అవసరం లేదని, 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని సీపీఎం పార్టీ కోరుతోందని ఆయన సూచించారు.