: 'ఏది నిజం?' అంటూ అభిమానులను అడిగిన గాయని గీతామాధురి!
ప్రముఖ సినీ నేపథ్య గాయని గీతామాధురి పెద్దలు చెప్పిన ఓ విషయంలో గందరగోళానికి గురైంది. దీంతో అభిమానులను తన అనుమానం తీర్చాలని కోరింది. సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉండే గీతామాధురి పెద్దలు 'దీర్ఘ స్నానం.. శ్రీఘ్ర భోజనం' అన్నారు కదా...మరి కొంత మంది నెమ్మదిగా భోజనం చేయాలని, అలా చేయడం వల్ల ఆహారం జీర్ణమవుతుందని చెబుతారు ఈ రెంటిలో ఏది నిజం? అని అడిగింది. నెమ్మదిగా భోజనం చేయాలా? లేక వేగంగా భోజనం చేయాలా? అన్న విషయంపై సమాధానం కోరింది. దీనికి నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది.