: కేంద్ర మంత్రి పదవిపై కేసీఆర్ తీసుకునేదే తుది నిర్ణయం: టీఆర్ఎస్ ఎంపీ కవిత


కేంద్ర మంత్రి పదవులపై తమ అధినేత కేసీఆర్ తీసుకునేదే తుది నిర్ణయమని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. పెద్ద నోట్ల రద్దుపై తప్పని పరిస్థితుల్లోనే కేంద్రానికి మద్దతు పలికామని చెప్పారు. అంతేకాని, కేంద్ర మంత్రి పదవుల కోసమే ప్రధాని మోదీకి మద్దతు ఇచ్చామనడంలో వాస్తవం లేదని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం గురించి కాంగ్రెస్ నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వారు ఏమేం చేశారో ప్రజలందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. 

  • Loading...

More Telugu News