: 'ట్రిపుల్ ఎక్స్' తొలుత భారత్ లోనే విడుదలవుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నా: దీపికా పదుకునే


అమెరికాకు చెందిన విన్ డీజిల్, శామ్యూల్ ఎల్ జాక్సన్, భారత్ కు చెందిన దీపికా పదుకునే, చైనాకు చెందిన డొనీ ఎన్, ధాయ్ లాండ్ కు చెందిన టోనీ జా కీలక పాత్రల్లో నటించిన హాలీవుడ్ సినిమా 'ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్' తొలుత భారత్ లో విడుదల కానుంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన దీపికా పదుకునే ట్విట్టర్ ద్వారా ఈ విషయం చెప్పింది. ప్రపంచంలో మరెక్కడా విడుదల కాకముందే భారత్ లో ఈ సినిమా విడుదలవుతుందని చెప్పడాన్ని గర్వంగా భావిస్తున్నానని దీపికా ట్వీట్ చేసింది. జనవరి 14న అంటే సంక్రాంతి రోజున ఈ సినిమా భారత్ లో విడుదల కానుంది. ఈ సినిమాకు డీజే కురుసో దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను దీపిక ట్వీట్ చేసింది. 

  • Loading...

More Telugu News