: హయత్ నగర్ వద్ద జాతీయ రహదారిపై కారులో వ్యక్తి ఆత్మహత్య


రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లోని జాతీయ రహదారిపై స్కోడా కారులో గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కారులో నిద్రమాత్రలు లభించడంతో అవి మింగి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. కారులో లభ్యమైన ఆధారాలను బట్టి ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి మియాపూర్ కు చెందిన ముఖేష్ గా భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు మియాపూర్ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 

  • Loading...

More Telugu News