: భోజనానికి వస్తానన్నారు కానీ... వస్తున్నట్టు చెప్పలేదు!: జానారెడ్డి


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఇంటికి భోజనానికి వస్తానని చెప్పారే కానీ... ఎప్పుడు వస్తున్నదీ చెప్పలేదని తెలంగాణ సీఎల్పీ నాయకుడు జానారెడ్డి చమత్కరించారు. 'కేసీఆర్ మా ఇంటికి వస్తే జొన్న అన్నం పెడతా'నని అన్నారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆయన సరదాగా ఈ వ్యాఖ్యలు చేశారు. తన పనితీరు పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ అసంతృప్తిని వ్యక్తం చేయలేదని... సీఎల్పీ పదవిపై ఎవరికైనా ఆసక్తి ఉంటే చెప్పండంటూ తమ ఎమ్మెల్యేలకు ఇంతకు ముందే చెప్పానని తెలిపారు.

తెలంగాణ శాసనసభలో మంగళవారం కేసీఆర్ మాట్లాడుతూ, జానారెడ్డి ఇంటికి భోజనానికి వెళ్లాలని తనకు ఎప్పటి నుంచో ఉందని చెప్పారు. ప్రతిపక్ష నేత ఇంటికి ముఖ్యమంత్రి వెళ్లే సంప్రదాయం గతంలో ఉండేదని... ఇప్పుడు అవన్నీ లేవని తెలిపారు. మళ్లీ అలాంటి సంప్రదాయం రావాల్సిన అవసరం ఉందని అభిలషించారు. ఈ క్రమంలోనే, జానారెడ్డి సరదాగా వ్యాఖ్యానించారు. 

  • Loading...

More Telugu News