: ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా విరల్ ఆచార్య నియామకం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నలుగురు డిప్యూటీ గవర్నర్లలో ఒకరిగా విరల్ వి ఆచార్యను నియమించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఈ పదవిలో మూడేళ్ల పాటు ఆయన కొనసాగనున్నట్లు పేర్కొంది. అయితే, ఆర్బీఐ లో ఆయన ఏ బాధ్యతలు నిర్వహిస్తారనే విషయం మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. ఉర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్ పదవిలోకి వెళ్లిపోవడంతో డిప్యూటీ గవర్నర్లలో ఒక స్థానం ఖాళీ అయింది. దీంతో, ఆ స్థానాన్ని ఆచార్యతో భర్తీ చేశారు. కాగా, విరల్ వి ఆచార్య ప్రస్తుతం న్యూయార్క్ విశ్వవిద్యాలయంలోని స్ట్రీన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.