: బీజేపీ ఎంపీ ట్వీట్ పట్ల ఘాటుగా స్పందించిన వినోద్ కాంబ్లి


మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి దళితుడు కావడం వల్లే క్రికెట్ నుంచి అతను కనుమరుగు అయ్యాడంటూ ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ, దళిత నేత అయిన ఉదిత్ రాజ్ వ్యాఖ్యానించారు. దళితుడినని ఒప్పుకోవడానికి కాంబ్లి సిగ్గుపడరాదని ఆయన అన్నారు. ఉదిత్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యల పట్ల వినోద్ కాంబ్లి కూడా ఘాటుగా స్పందించాడు. "మిస్టర్ రాజ్, మీరు చేసిన వ్యాఖ్యలను నేను సమర్థించను. నా కులానికి, నా క్రికెట్ కెరీర్ కు ఏమాత్రం సంబంధం లేదు. కాబట్టి నా పేరును ఇంకెప్పుడూ ఉపయోగించకండి" అంటూ బదులిచ్చాడు. మరోవైపు, ఉదిత్ రాజ్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

  • Loading...

More Telugu News