: నా కుమారుడు నాన్నలా, పెదనాన్నలా దేశానికి పేరు తెస్తాడు: ఇర్ఫాన్ పఠాన్


టీమిండియా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఇటీవలే తండ్రి అయ్యాడు. ఇర్ఫాన్-సఫాబేగ్ దంపతులకు పండంటి కుమారుడు పుట్టాడు. ఈ వార్తను ట్విట్టర్ ద్వారా ఇర్ఫాన్ అందరితో పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో దివ్యాన్షురాజు అనే అభిమాని ఇర్ఫాన్ కు అభినందలు తెలిపాడు. అంతేకాదు, "బ్రదర్. చిన్నారికి యూకూబ్, దావూద్ అనే పేర్లు పెట్టవద్దు" అని సూచించాడు.
దీనిపై ఇర్ఫాన్ చాలా హుందాగా స్పందించాడు. "దివ్యాన్షు, ఏ పేరు పెట్టినా సరే... నా కుమారుడు నాన్నలా, పెదనాన్నలా దేశానికి పేరు తీసుకొస్తాడు" అంటూ సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత తన కుమారుడికి ఇమ్రాన్ ఖాన్ పఠాన్ గా పేరు పెట్టినట్టు ట్వీట్ చేశాడు. 

  • Loading...

More Telugu News