: ప్రతిపక్షాల్లో చీలిక లేదు... వేచి చూస్తున్నారంతే: సురవరం
నోట్ల రద్దు తరువాత నిరసనలు తెలియజేయడంలో విపక్షాలు ఐకమత్యంగా లేవని వస్తున్న వార్తలపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి స్పందించారు. ఈ మధ్యాహ్నం విజయవాడలో ఆయన మాట్లాడుతూ, నోట్ల రద్దుతో నల్లధనం అంతం కాదని అన్నారు. దేశంలోని ప్రతిపక్షాల్లో చీలిక లేదని, నోట్ల రద్దు చూపే ప్రతికూల ప్రభావంపై కొన్ని పార్టీలు వేచి చూస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్త ప్రతిపక్ష కూటమి ఏర్పాటు ఆలోచన ఎంతమాత్రమూ లేదని స్పష్టం చేసిన ఆయన, యూపీఏ పాటించిన కార్పొరేట్ అనుకూల విధానాన్నే బీజేపీ ప్రభుత్వం కూడా అవలంబిస్తోందని ఆరోపించారు. ఇప్పటివరకూ దేశంలోని ఆర్థిక నేరగాళ్ల పేర్లను ఎందుకు ప్రకటించలేదని ఆయన ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధితో పాటు వైద్యం, విద్య తదితర రంగాలకు నిధుల్లో కోత విధించిందని సురవరం ఆరోపించారు.