: కొందరి ఇగోతో బంధం తెగుతోంది... నితీశ్ పేరు చెప్పకుండా లాలూ వ్యాఖ్య
మహాకూటమి మిత్రుడు, బీహర్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పేరును వెల్లడించకుండా, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ విమర్శలు చేశారు. మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించేందుకు అంగీకరించని నితీశ్ వైఖరిని ఎండగడుతూ, వ్యక్తిగత అహంతో ఐక్యత దెబ్బతింటోందని వ్యాఖ్యానించారు. "చాలా మంది వ్యక్తిగత అహంతో ఒకే వేదికపైకి వచ్చి నిరసన చెప్పేందుకు ముందుకు రావడం లేదు. దీంతో ఐక్యత దెబ్బతిని బంధం తెగుతోంది" అని వ్యాఖ్యానించారు. నిరసనలు తెలిపేందుకు ఎవరు రాకున్నా తనకేమీ బాధ లేదని, తమ పార్టీ మాత్రం నోట్ల రద్దుకు వ్యతిరేకంగా పోరాడుతుందని, తాను స్వయంగా ధర్నాలో కూర్చుంటానని తెలిపారు.