: గౌతమీపుత్ర శాతకర్ణిలో బాలయ్య వారసుడు... చిన్నదైనా, ముఖ్యమైన పాత్రలో మోక్షజ్ఞ!
ఈ సంక్రాంతికి విడుదల కానున్న బాలకృష్ణ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'లో ఆయన వారసుడు కూడా కనిపించనున్నట్టు తెలుస్తోంది. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఈ చిత్రంతోనే తెరంగేట్రం చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. చిన్నదే అయినా, ఓ ముఖ్యమైన పాత్రలో మోక్షజ్ఞ నటించాడని, మోక్షజ్ఞ ఎంట్రీ అలరించే విధంగా ఉండేలా క్రిష్ కృషి చేశాడని సినీ వర్గాల సమాచారం. ఈ విషయమై అధికారికంగా ఎటువంటి వార్తా వెల్లడి కానప్పటికీ, ఇదే నిజమైతే కనుక, బాలయ్య అభిమానులకు పండగే. ఈ చిత్రం పాటలు తిరుపతిలో జరిగిన వేడుకలో విడుదలైన సంగతి తెలిసిందే.