: బీహార్ సీఎం 'సూపర్' అంటే... 'అంత సీన్ లేద'న్న డిప్యూటీ సీఎం!


పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం చాలా బాగుందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పలుమార్లు చెప్పారు. అయితే, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ మాత్రం అంత సీన్ లేదని తేల్చిపారేశారు. నోట్ల రద్దు తర్వాత దేశ వ్యాప్తంగా పరిస్థితులు దారుణంగా మారిపోయాయని... ప్రజల కష్టాలు అంతకంతకూ పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మారుమూల గ్రామాల్లోని పరిస్థితి, బడుగు, బలహీన వర్గాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని అన్నారు. నోట్ల కోసం పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారని తెలిపారు. ప్రజల కష్టాల గురించి ప్రధానమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితి సూపర్ ఎమర్జెన్సీని తలపిస్తోందంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు కరెక్టే అని తనకు అనిపిస్తోందని అన్నారు.

  • Loading...

More Telugu News