: సూరత్ లో దొంగ నోట్లతో పట్టుబడ్డ బ్రిటన్ వాసి


సూరత్ పరిధిలోని లింబాయత్ ప్రాంతంలో నకిలీ కరెన్సీని కలిగివున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు బ్రిటన్ వాసి కావడం కలకలం రేపింది. మొత్తం రూ. 6 లక్షల నకిలీ కరెన్సీ (రూ. 1000 నోట్లు) వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. తాను ఈ నోట్లను యూకే నుంచి తెచ్చినట్టు బ్రిటన్ వాసి వెల్లడించడం గమనార్హం. బారుచ్ జిల్లా జాంబుసార్ నివాసి, ప్రస్తుతం బ్రిటన్ పౌరుడిగా, దక్షిణ లండన్ లోని స్లాగ్ ప్రాంతంలో నివసిస్తున్న జాకీర్ యాకూబ్ పటేల్ (40)ను అరెస్ట్ చేశామని, ఇతను యూకేలోని ఓ మదారసాలో ఉర్దూ, ఇంగ్లీష్ భాషలు బోధిస్తున్నట్టు విచారణలో వెల్లడించాడని పోలీసులు తెలిపారు.

అరెస్ట్ చేసిన మిగతా ఇద్దరిలో జాకీర్ సోదరుడు సర్ఫరాజ్ యాకూబ్ పటేల్ (35), ఫైజల్ ఇబ్రహీం పటేల్ (26) ఉన్నారని, సర్ఫరాజ్ మసీదుల్లో ప్రార్థనల వేళ అనౌన్సర్ గా పనిచేస్తున్నాడని వివరించారు. పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చేందుకు ఫైజల్ ప్రయత్నిస్తున్నాడన్న సమాచారం అందుకుని దాడులు చేయగా, వీరు దొరికారని, వీరి వద్ద ఉన్న కరెన్సీ నకిలీదని తెలిపారు.

  • Loading...

More Telugu News