: భారత్ తో స్నేహం వద్దు... పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన ముంబై దాడుల కుట్రదారు


భారత్ తో స్నేహం కుదుర్చుకునే ప్రయత్నాలను ఏమాత్రం చేయవద్దంటూ పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ఉగ్రవాద సంస్థ జమాత్- ఉద్-దవా చీఫ్ హఫీజ్ సయీద్ హెచ్చరించాడు. 2008లో జరిగిన ముంబై దాడుల కుట్రదారు హఫీజ్ సయీదే అన్న విషయం తెలిసిందే. కశ్మీర్ లో భారత భద్రతా బలగాలు అకృత్యాలకు పాల్పడుతున్నాయని... అక్కడి భౌగోళిక రూపురేఖలను మార్చేందుకు భారత ప్రభుత్వం యత్నిస్తోందని హఫీజ్ చెప్పాడు. కశ్మీర్ ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయని... వాటిని తీర్చేందుకు పాక్ ప్రభుత్వం కృషి  చేయాలని కోరాడు. అజాద్ కశ్మీర్ కోసం కశ్మీరీలు చేస్తున్న పోరాటానికి తాము పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. కశ్మీర్ లో యువకుల నెత్తురు చిమ్ముతోందని... వారిని ఆదుకునే బాధ్యత పాకిస్థాన్ దే అని చెప్పాడు.

  • Loading...

More Telugu News