: మా ఇద్దరి రాక దేశ రాజకీయాలను మలుపు తిప్పుతుంది: ఆసిఫ్ అలీ జర్దారీ


దివంగత పాకిస్థాన్ ప్రధాని బెనజీర్ భుట్టో భర్త, పాక్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ కీలక ప్రకటన చేశారు. తాను, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ అయిన తన కుమారుడు బిలావల్ భుట్టో ఇద్దరం పాక్ పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నామని తెలిపారు. రానున్న ఉపఎన్నికల్లో తామిద్దరం పోటీ చేస్తున్నామని స్పష్టం చేశారు.

తమ రాక దేశ రాజకీయాల్లో పెను మార్పులను తీసుకొస్తుందని చెప్పారు. నవాబ్ షా నియోజకవర్గం నుంచి తాను, సింధ్ ప్రావిన్సెస్ నుంచి బిలావల్ బరిలోకి దిగుతామని చెప్పారు. తన చెల్లి అజ్రా పెచువ్సో ప్రాతినిధ్యం వహిస్తున్న నవాబ్ షా నుంచి తాను బరిలోకి దిగుతానని జర్దారీ తెలిపాడు. అలాగే సూమ్రో షాహిబ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సీట్ నుంచి బిలావల్ పోటీ చేస్తారని చెప్పారు. నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందంటూ ఈ సందర్భంగా ఆసిఫ్ అలీ జర్దారీ ఆరోపించారు. ప్రభుత్వం మొత్తం అవినీతి ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు. 

  • Loading...

More Telugu News