: విడాకులు ఇప్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన అడిషనల్ డీసీపీ
తన భార్య వేదశ్రీతో విడాకులు ఇప్పించాలని, 1983, జూన్ 8న జరిగిన తమ వివాహాన్ని రద్దు చేస్తున్నట్టు ఆదేశించాలని కోరుతూ చార్మినార్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్ జోన్) కే బాబూరావు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన భార్యకు వివిధ సందర్భాల్లో ముగ్గురితో అక్రమ సంబంధాలు ఉన్నాయని ఈ పిటిషన్ లో బాబూరావు ఆరోపించారు. నలుగురు పిల్లలకు తల్లి అయిన తరువాత కూడా తానంటే ఆమెకు గౌరవం లేదని, వైవాహిక బంధానికి విలువ ఇవ్వడం లేదని పేర్కొన్నారు.
20 ఏళ్ల క్రితమే తనను వదిలేసిందని, 2006 లో ఆమెకు రూ. 6 లక్షలు చెల్లించానని చెప్పారు. ఇదిలావుండగా, తన భర్త, తయ్యాబా తస్నీమ్ అనే మహిళ కలసి ఉంటున్నారని, వీరిద్దరూ కలసి తనకు చెందిన 192 గజాల స్థలం డాక్యుమెంట్లు కాజేశారని, తన సంతకాన్ని ఫోర్జరీ చేసి విక్రయించారని నాంపల్లి అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో వేదశ్రీ కేసు వేశారు. తాను అందంగా ఉండటం లేదని ఆరోపిస్తూ, మానసికంగా, శారీరకంగా బాబూరావు తనను హింసించాడని కోర్టుకు తెలిపారు. ఈ కేసు అటు పోలీసు వర్గాలతో పాటు ప్రజల్లోనూ చర్చనీయాంశమైంది.