: అగ్ని-5పై చైనా విమర్శలకు భారత్ దీటైన సమాధానం


ఐదవతరం అగ్ని క్షిపణి పరీక్షను భారత్ విజయవంతంగా నిర్వహించిన తరువాత, చైనా చేసిన వ్యాఖ్యలపై భారత్ దీటుగా బదులిచ్చింది. తామీ మిసైల్ ను ఏ దేశం కోసమో తయారు చేసుకోలేదని, క్షిపణి పరీక్షల విషయంలో అన్ని అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడే అడుగులు వేస్తున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ వ్యాఖ్యానించారు. ప్రత్యేకించి ఒక దేశాన్ని లక్ష్యంగా తామెన్నడూ చూడలేదని, మిగతా దేశాలు ఎలా మిసైల్ టెక్నాలజీని వాడుకుంటున్నాయో, ఇండియా కూడా అదే పని చేస్తోందని, ఇది దేశ రక్షణలో వ్యూహాత్మక విధానమని ఆయన అన్నారు.

కాగా, అగ్ని-5పై నిన్న చైనా స్పందిస్తూ, చైనాలోని అన్ని ప్రాంతాలనూ ఇది చేరుతుందని, క్షిపణి సామర్థ్యంపై ఇండియా తప్పుడు సమాచారాన్ని అందిస్తోందని ఆరోపించిన సంగతి తెలిసిందే. అగ్ని-5ను చైనా కోసమే ఇండియా తయారు చేసిందన్న వార్తలు చైనా పత్రికల్లో వచ్చాయి. ఈ నేపథ్యంలోనే విదేశాంగ శాఖ స్పందించింది.

  • Loading...

More Telugu News