: కేసీఆర్, చంద్రబాబులను నవ్వించిన సానియా, సింధు!
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను క్రీడాకారిణులు సానియా మీర్జా, పీవీ సింధులు నవ్వించారు. రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం ఇచ్చిన విందుకు చంద్రబాబు, కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ఒలింపిక్ విజేత పీవీ సింధు కూడా హాజరై ప్రధాన ఆకర్షణగా నిలిచారు. రాష్ట్రపతి అతిథులతో కలిసి ఫొటోలు దిగుతున్న సమయంలో చంద్రులిద్దరూ కలిసి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు.
సరిగ్గా అదే సమయంలో సానియామీర్జా, సింధు వారి వద్దకు వచ్చి.. 'సార్, మీరిద్దరూ ఒకేచోట కనిపించడం చాలా అరుదు. మీతో కలిసి సెల్ఫీ తీసుకుంటాం' అని కోరారు. దీనికి సీఎంలు ఇద్దరూ నవ్వుతూ అంగీకరించారు. అయితే సెల్ఫీ దిగేటప్పుడు వారు కాస్త సీరియస్‌గా ఉండడంతో.. 'సార్.. ఫొటో తీసేటప్పుడు కాస్త నవ్వండి సార్' అని సానియా మీర్జా అనడంతో కేసీఆర్, చంద్రబాబు ఇద్దరూ పడిపడి నవ్వారు.