: విజయనగరం వైసీపీలో ముదిరిన వర్గపోరు.. నేడు అనుచరులతో కోలగట్ల రహస్య సమావేశం.. పార్టీకి బైబై చెప్పేస్తారా?
విజయనగరం వైసీపీలో వర్గపోరు మరింత ముదిరింది. ప్రత్యర్థి బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీనును అధిష్ఠానం దగ్గరకు తీసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్న కోలగట్ల వీరభద్రస్వామి వర్గం ఏదో ఒకటి తేల్చేయాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో నేడు కోలగట్ల తన అనుచరులతో రహస్య సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి చిన్న శ్రీను రోజురోజుకు దగ్గరవుతుండడం, కోలగట్లను దూరం పెడుతుండడంతో ఆయన వర్గం తట్టుకోలేకపోతోంది. జిల్లా పార్టీలో ప్రస్తుతం నెలకొన్న వర్గపోరు గురించి అధినేతకు తెలిసినా పరిష్కారానికి ముందుకు రావడం లేదని కోలగట్ల వర్గం ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే నేడు సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కోలగట్ల పార్టీకి బైబై చెప్పేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.