: అమ్మకాల్లో అమెరికా రికార్డు.. 40 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను అమ్మేసిన అగ్రరాజ్యం
అగ్రరాజ్యంగా కీర్తి అందుకున్న అమెరికా ఆయుధాల అమ్మకాల్లోనూ తామే ముందని నిరూపించింది. ప్రపంచ వ్యాప్తంగా గతేడాది జరిగిన ఆయుధాల అమ్మకాల్లో అమెరికా నెంబర్ వన్ స్థానాన్ని అలంకరించింది. మొత్తం 40 బిలియన్ డాలర్ల ఆయుధాలు విక్రయించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అమెరికా అమ్మకాలు ప్రపంచ మార్కెట్లోని మిగతా దేశాలు జరిపిన ఒప్పందాలకు దాదాపు సమానం. అమెరికా తర్వాతి స్థానాన్ని ఫ్రాన్స్ దక్కించుకుంది. ఇక గతేడాది అత్యధికంగా ఆయుధాలు కొనుగోలు చేసిన దేశంగా పాకిస్థాన్ నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఖతర్ 17 బిలియన్ డాలర్లు, ఈజిప్టు 12 బిలియన్ డాలర్లు, సౌదీ అరేబియా 8 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు కొనుగోలు చేసినట్టు ఒక అధ్యయనంలో వెల్లడైంది.