: నల్గొండ జిల్లాలో ఔషధ గుణాలున్న అరుదైన చేప లభ్యం..మత్స్యశాఖ అధికారులకు అప్పగింత
నల్గొండ జిల్లాలోని ఉదయ సముద్రం రిజర్వాయర్‌లో అరుదైన చేప దొరికింది. మంగళవారం రిజర్వాయర్‌లో చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ జాలరి వలకు ఇది చిక్కింది. ఈ చేపను వెంటనే మత్స్యశాఖ అధికారులకు అప్పగించారు. దీని శాస్త్రీయ నామం అంగిల్లా బెంగాల్ ఎన్సన్ అని జిల్లా మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ చరిత పేర్కొన్నారు. పామును పోలి ఉండే ఈ చేపలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయని, విదేశాల్లో ఈ చేపలకు విపరీతమైన డిమాండ్ ఉంటుందని తెలిపారు. ఇవి 27 సెంటీమీటర్ల పొడవు, 7 కేజీల బరువు పెరుగుతాయని ఆమె వివరించారు.