: హైదరాబాద్‌లోని ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్.. కార్మికుడి సజీవ దహనం
రంగారెడ్డి జిల్లా గగన్‌పహాడ్‌లోని ఓ ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలడంతో శంకర్ అనే కార్మికుడు సజీవ దహనమయ్యాడు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఏడుగురు కార్మికులు విధుల్లో ఉన్నట్టు సమాచారం. క్షతగాత్రులను వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.