: పెద్ద నోటు రద్దుకు ప్రజాప్రతినిధులు మొగ్గు చూపినా, అంగీకరించని ‘పాక్’ ప్రభుత్వం !
నల్ల ధనవంతుల, అవినీతిపరుల ఆట కట్టించేందుకు భారత్ లో పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంతో పొరుగుదేశమైన పాకిస్థాన్ కూడా ఆ దిశగా ఆలోచనలు చేసింది. ఈ క్రమంలో ‘పాక్’ లో పెద్దనోటు అయిన రూ.5,000ను రద్దు చేయాలని అక్కడి సెనెట్ లో ప్రజాప్రతినిధులు ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ నోటు రద్దుకు అధిక శాతం ప్రజా ప్రతినిధులు మొగ్గు చూపినప్పటికీ, ఆ దేశ ఆర్థికశాఖ మాత్రం ఒప్పుకోలేదు. పెద్ద నోట్ల రద్దు వల్ల వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతుందని, ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉంటుందని ‘పాక్’ ఆర్థిక శాఖ అభిప్రాయపడింది. దీంతో, రూ.5,000 నోట్ల రద్దుకు పాకిస్థాన్ ప్రభుత్వం తిరస్కరించినట్టయింది.