: ఇస్లాం ఏం చెబుతుందో మాకు తెలుసు.. ఎవరి సలహాలు మాకు అక్కర్లేదు: క్రికెటర్ షమీ తండ్రి


టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ సోషల్ మీడియాలో ఇటీవల పోస్టు చేసిన తన ఫ్యామిలీ ఫొటోపై పలు కామెంట్లు వచ్చిన విషయం తెలిసిందే. షమీ భార్య స్లీవ్ లెస్ గౌన్ వేసుకుని ఉండటంపై ఈ విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలను తిప్పికొట్టిన షమీ, ఘాటుగా స్పందించడం విదితమే. తాజాగా, షమీ తండ్రి టౌసిప్ అలీ కూడా స్పందించారు. ఇస్లాం మతం ఏం చెబుతుందో తమకు తెలుసు అని, తమకు ఎవరి ఉచిత సలహాలు అవసరం లేదని అన్నారు. తన కుమారుడిని ఇబ్బంది పెట్టేందుకే ఒక పథకం ప్రకారం ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయమై షమీకి భారతీయులందరూ మద్దతు తెలపాలని టౌసిఫ్ అలీ కోరారు.

  • Loading...

More Telugu News