: లంచం తీసుకున్న కేసులో బందరు సబ్ రిజిస్ట్రార్ కు నాలుగేళ్ల జైలు శిక్ష
లంచం తీసుకున్న కేసులో బందరు సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావుకు విజయవాడ కోర్టు జైలుశిక్ష విధించింది. ఏసీబీ దాఖలు చేసిన కేసులో పూర్వారాలు పరిశీలించిన కోర్టు.. శ్రీనివాసరావుకు నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు రూ.45 వేలు జరిమానా కూడా విధిస్తూ తీర్పునిచ్చింది. కాగా, 2003లో శ్రీనివాసరావు రూ.3 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు.