: మరో రెండు రోజుల్లో ప్రజలకు తీపి కబురు: వెంకయ్యనాయుడు
మరో రెండు రోజుల్లో ప్రజలకు తీపి కబురు రాబోతోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. అయితే, అదేమిటనేది మాత్రం ఆయన వెల్లడించలేదు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని అక్షర విద్యాలయంలో నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, నగదు రహిత లావాదేవీలపై విద్యార్థులు, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. అవినీతిపరులకు వేధింపులు అధికమవుతాయని, అక్రమార్కులను పట్టుకుని తీరుతామని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.