: మోదీజీ, అలా చేస్తే చరిత్రలో కనుమరుగైపోతారు: శివసేన
స్వరాజకీయాల కోసం ఛత్రపతి శివాజీ పేరును ఉపయోగించుకోవద్దని, అలా చేస్తే చరిత్రలో కనుమరుగై పోతారని శివసేన పార్టీ పత్రిక సామ్నా ప్రధాని మోదీని విమర్శించింది. స్వదేశానికి వ్యతిరేకంగా ఉన్న వారిని శివాజీ ఎప్పుడూ శత్రువులుగానే చూసేవారని పేర్కొంది. ఔరంగజేబు, అఫ్జల్ ఖాన్, షైస్తా ఖాన్ వంటి వారికి శివాజీ ఎప్పుడూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదని తెలిపింది. పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ పుట్టినరోజు సందర్భంగా మన ప్రధాని మోదీ ఇటీవల శుభాకాంక్షలు తెలియజేయడాన్నిఈ సందర్భంగా శివసేన తప్పుబట్టింది. కాగా, ముంబయిలో రెండు రోజుల క్రితం శివాజీ మెమోరియల్ కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన తర్వాత శివసేన పార్టీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.