: గ్యాంగ్ స్టర్ అయూబ్ ఖాన్ 72 కేసుల్లో నిందితుడు: హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీ
గ్యాంగ్ స్టర్ అయూబ్ ఖాన్ 72 కేసుల్లో నిందితుడని హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. ఈరోజు మీడియా ముందు అయూబ్ ఖాన్ ని ప్రవేశపెట్టారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన అయూబ్ ఖాన్ ని తన నకిలీ పాస్ పోర్టు ఆధారంగా ముంబై ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించినట్లు తెలిపారు. వారి సాయంతో అతన్ని అదుపులోకి తీసుకున్నామని, ఆ గ్యాంగ్ లో మిగిలిన వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు. పాతబస్తీలో ఇప్పటివరకు 80 మందిపై పీడీ యాక్టు నమోదు చేశామని తెలిపారు.