: చోరీ చేయడానికి వచ్చి 11 మందిని బాత్‌రూంలో బంధించారు.. ఊపిరి ఆడక ఆరుగురి మృతి
ఓ ఇంట్లో చోరీ చేయడానికి వచ్చిన దొంగలు ఆ ఇంట్లోని 11 మందిని ఒక చిన్నపాటి బాత్‌రూంలో బంధించడంతో ఊపిరి ఆడక వారిలో ఆరుగురు మృతిచెందిన ఘటన ఇండోనేసియా రాజధాని జకార్తాలో జరిగింది. నిన్న జరిగిన ఈ దారుణ ఘటన ఈ రోజు వెలుగులోకొచ్చింది. దొంగలు బాత్‌రూంలో బంధించిన 11 మందిలో ఆ ఇంటి పనివారు, డ్రైవర్ సహా ఓ తొమ్మిదేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. దుండగులు వారిని కత్తులు, తుపాకులతో బెదిరించినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిలో బాలుడు కూడా ఉన్నాడని తెలిపారు. ఘటనలో అస్వస్థతకు గురయిన మరో ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.