: ఇచ్చిన హామీని కేసీఆర్ నిలబెట్టుకుంటే.. నా మద్దతు ఆయనకే!: కోమటిరెడ్డి


సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటే, తాను ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయన్నే గెలిపిస్తానని  కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  అన్నారు. బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణంపై తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలను ఎక్కువ కాలం మభ్యపెట్టకుండా వచ్చే రెండున్నరేళ్లలో ఎన్ని రోజుల్లో, ఎన్ని ఇళ్లు కడతారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎన్నికల సమయంలో ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చినందునే టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేశారని అన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం జరిగే పనికాదని, అయితే, సిద్దిపేట, ఎర్రవల్లిలో మాత్రమే వాటిని నిర్మించారని అన్నారు. మిగిలిన ప్రాంతాల్లోని పేదలు కూడా తమకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎప్పుడిస్తారని ప్రశ్నిస్తున్నారన్నారు. 150 గదులతో  సీఎం క్యాంపు కార్యాలయం నిర్మించినందుకు తాము గర్వపడుతున్నామని, అంతే శ్రద్ధ పెడితే డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కూడా పూర్తయ్యేదన్నారు. సీఎం కాక ముందు కేసీఆర్ చెప్పిన విధానం ప్రజలకు నచ్చిందని, ఆ హామీని నిలుపుకోవాలని కోమటిరెడ్డి సూచించారు. 

  • Loading...

More Telugu News