: ఈ ఏడాదిలో ఏపీ వ్యాప్తంగా 259 అవినీతి కేసులు నమోదు: అ.ని.శా. డీజీ
ఈ ఏడాదిలో ఏపీ వ్యాప్తంగా 259 అవినీతి కేసులు నమోదైనట్లు అవినీతి నిరోధక శాఖ డీజీ ఆర్పీ ఠాకూర్ వెల్లడించారు. నవ్యాంధ్రలో వేల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అవినీతి వల్ల రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలగకూడదని, సాంకేతికతను వినియోగించుకుని అవినీతిపరులను పట్టుకుంటున్నామన్నారు. అవినీతిపరులపై ఫిర్యాదుకు ఏర్పాటైన ‘వాట్సప్’కు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని, ‘వాట్సప్’కు వచ్చిన ఫిర్యాదులతో 40 అవినీతి కేసులు నమోదు చేశామని ఠాకూర్ పేర్కొన్నారు.