: ఫేస్ బుక్ లో తప్పుడు పోస్ట్... ప్రతిపక్ష నేతకు ఐదేళ్ల జైలు శిక్ష


ఫేస్ బుక్ లో తప్పుడు సమాచారంతో కూడిన పోస్ట్ పెట్టినందుకు కంబోడియా దేశ ప్రతిపక్ష నేత శామ్ రెయిన్సీకి ఐదేళ్ల జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళ్తే, తమ సరిహద్దు దేశమైన వియత్నాంతో సరిహద్దు అంశాలు, కొన్ని ఒప్పందాలకు సంబంధించి సంప్రదింపులకు అంగీకరించినట్టు ఆయన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కలకలం రేపింది. ఇరు దేశాల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా భావించారు. గత కొన్ని నెలలుగా ఈ విషయంపై అధికార కాంబోడియన్ పీపుల్స్ పార్టీ, ప్రతిపక్ష కాంబోడియా నేషనల్ రెస్క్యూ పార్టీల మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో, ఈ పోస్టుకు సంబంధించి విచారణ జరిపిన ఫెనాం పెన్హ్ మున్సిపల్ కోర్టు ప్రతిపక్ష నేత రెయిన్సీకి ఐదేళ్ల జైలు శిక్షను విధించింది. 2013 ఎన్నికల్లో రెయిన్సీ పార్టీ ఓటమి పాలయింది. ఇప్పటికే పరువునష్టం ఆరోపణలను ఎదుర్కొంటున్న రెయిన్సీ... అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి 2015లో ఫ్రాన్స్ కు వెళ్లి, అక్కడే తలదాచుకుంటున్నాడు. 

  • Loading...

More Telugu News