: సెలక్షన్ కమిటీపై నిప్పులు చెరిగిన రోహన్ బోపన్న


భారత డేవిస్ కప్ జట్టు నుంచి తనను తప్పించడంపై ప్రముఖ టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న మండిపడ్డాడు. తనను తొలగించడానికి కాణమేంటో చెప్పాలంటూ సెలక్షన్ టీమ్ ను డిమాండ్ చేశాడు. భారత టెన్నిస్ సంఘం సెలక్షన్ తీరు తనను ఆశ్చర్యానికి గురి చేసిందని... ర్యాంకుల ప్రాతిపదికన ఎంపిక చేయకుండా, తమకు ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వారినే ఎంపిక చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

 ఇది ఎంత వరకు న్యాయమని ప్రశ్నించాడు. మరోవైపు రోహన్ వ్యాఖ్యలపై సెలక్షన్ కమిటీ సభ్యుడు, డేవిస్ కప్ కోచ్ జీషన్ అలీ స్పందించాడు. సెలక్షన్ లో ఎలాంటి పొరపాటు జరగలేదని అలీ తెలిపాడు. ర్యాంకుల ఆధారంగానే ప్రతిసారీ ఆటగాళ్లను ఎంపిక చేయాల్సిన అవసరం లేదని చెప్పాడు. న్యూజిలాండ్ తో పోరుకు ఎవరైతే సరిగా సరిపోతారో వారినే ఎంపిక చేశామని తెలిపాడు. లియాండర్ పేస్, రామ్ నాథన్ రామ్ కుమార్, యూకీ బాంబ్రీ, సాకేత్ మైనేని, ప్రజ్ఞేష్ గున్నేశ్వరన్ లను డేవిస్ కప్ కు ఎంపిక చేశారు.

  • Loading...

More Telugu News