: విపక్ష సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేసిన టీఎస్ స్పీకర్
ఎస్సీ వర్గీకరణ అంశం ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో వేడి పుట్టించింది. ఈ అంశంపై చర్చ జరగాల్సిందే అంటూ విపక్ష సభ్యులు పట్టుబట్టారు. ప్రశ్నోత్తరాల సమయంలో వాయిదా తీర్మానంపై చర్చించడం కుదరదని స్పీకర్ మధుసూదనాచారి స్పష్టం చేశారు. దీంతో, టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు దూసుకుపోయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో వీరి ముగ్గుర్నీ సభ నుంచి సస్పెండ్ చేయాలంటూ మంత్రి హరీష్ రావు సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో వీరి ముగ్గుర్నీ సెషన్ మొత్తానికి సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. అయితే, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి కోరిక మేరకు వీరి ముగ్గురిపై విధించిన సస్పెన్షన్ ను స్పీకర్ ఎత్తివేశారు.