: నా జీవితం ప్రమాదంలో ఉంది... నన్ను చంపేస్తారేమో!: రామ్మోహన్ రావు


తన జీవితం ప్రమాదంలో ఉందని, తనను చంపేస్తారేమోనన్న అనుమానాలున్నా, ఎవరికీ భయపడే రకాన్ని కాదని తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు వ్యాఖ్యానించారు. కేంద్రం కుట్రతో తనపై దాడులు చేయించిందని, దేశంలోని ఐఏఎస్ అధికారులందరూ ఈ పరిస్థితిని గమనించాలని కోరారు. తొలిసారిగా ఓ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఇంటిపై సీఆర్పీఎఫ్ దళాలు దాడికి దిగాయని, తనను నిర్బంధించారని, నిండు గర్భిణిగా ఉన్న తన కోడలికి తుపాకులు చూపి బెదిరించారని ఆయన ఆరోపించారు.

తనకు శేఖర్ రెడ్డితో ఎలాంటి సంబంధం లేదని, ఆయనతో వ్యాపారాలు చేయలేదని చెప్పారు. తమ పనులు చేసి పెట్టాలని నిత్యమూ వందలాది మంది వినతులు సమర్పిస్తుంటారని వాటిని చూపించి, తానేదో అక్రమాలకు సహకరించినట్టు ఆరోపిస్తున్నారని రామ్మోహన్ అన్నారు. జయలలిత నీడన ఎదిగిన తాను, ఆమెకు మాదిరిగానే పూర్తి పారదర్శక జీవనం గడిపానని, చెన్నై నగరాన్ని వరదలు చుట్టుముట్టినప్పుడు తాను చేసిన కృషి అందరికీ తెలుసునని చెప్పారు. తనపై దాడి చేయాలంటే, సీఎం, కేంద్ర హోం శాఖ అనుమతులు తప్పనిసరని, వారు అనుమతించినట్టు ఉన్న ఆదేశాలు చూపించాలని సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News