: ఫుల్ ఫామ్ లో ఉన్న ఏపీ, టీఎస్ 'మందుబాబు'లు!


రాష్ట్ర విభజన అనంతరం పలు సమస్యలను ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాలు... మద్యం అమ్మకాల్లో మాత్రం దూసుకుపోతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ మందుబాబులు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అయితే, మద్యం అమ్మకాల్లో ఏపీ కన్నా తెలంగాణ మరింత ముందుండటం విశేషం. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు మద్యం అమ్మకాలు, ఆదాయాల వివరాలను సరిహద్దు రాష్ట్రాలతో పోల్చి, విశ్లేషించింది ఏపీ అబ్కారీ శాఖ.

ఈ ఏడాది ఇప్పటి వరకు తెలంగాణ అత్యధికంగా 16.15 శాతం వృద్ధిని నమోదు చేయగా... రెండో స్థానంలో ఏపీ 11.28 శాతం, ఆ తర్వాత తమిళనాడు 8.33 శాతం, కేరళ 7.7 శాతం, కర్ణాటక 7.05 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఆదాయం రూ. 7,822 కోట్లు కాగా... ఈ ఏడాది ఇప్పటికే రూ. 9,085 కోట్ల ఆదాయం వచ్చింది. ఏపీ విషయానికి వస్తే... గత ఏడాది ఆదాయం రూ. 8,198 కోట్లు కాగా... ఈ ఏడాది ఇప్పటి వరకు రూ. 9,123 కోట్ల ఆదాయం నమోదయింది. ఏపీలో బీర్ల అమ్మకాలు ఊపందుకోగా... తెలంగాణలో మద్యం అమ్మకాలు భారీగా ఉన్నాయి.     

  • Loading...

More Telugu News